Google Family Link, మీ ఫ్యామిలీని ఆన్‌లైన్‌లో సురక్షితం చేయడంలో సాయపడే తల్లిదండ్రుల కంట్రోల్స్ యాప్. సులభంగా ఉపయోగించగల Family Link టూల్స్ మీ చిన్నారి తమ పరికర సమయాన్ని ఎలా వినియోగిస్తున్నారో తెలుసుకోవడానికి, వారి పరికర లొకేషన్‌ను చూడటానికి, గోప్యతా సెట్టింగ్‌లను మేనేజ్ చేయడం మరిన్నింటిని మీరు అర్థం చేసుకోవడానికి అనుమతిస్తాయి.
Family Linkతో, మీరు వీటిని చేయవచ్చు:
ప్రాథమికమైన డిజిటల్ నియమాలను స్థిరపరచడం
• పరికర వినియోగ వ్యవధి పరిమితులను సెట్ చేయడం — Family Link మీ పిల్లలకు పరికరం అందుబాటులో లేకుండా వుండే సమయాన్ని, యాప్‌లకు సమయ పరిమితులను సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, తద్వారా మీరు ఆరోగ్యకరమైన బ్యాలెన్స్‌ని కనుగొనడంలో వారికి సహాయపడగలరు.
• వయస్సుకు తగిన కంటెంట్‌కు వారిని గైడ్ చేయడం — మీ పిల్లలు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న యాప్‌లను ఆమోదించండి లేదా బ్లాక్ చేయండి. మీ పిల్లల కోసం సరైన YouTube అనుభవాన్ని ఎంచుకోవడానికి కూడా Family Link మిమ్మల్ని అనుమతిస్తుంది: YouTube లేదా YouTube Kidsలో యాక్సెస్ పర్యవేక్షణ మోడ్.
మీ పిల్లల ఖాతాను మేనేజ్ చేయండి, సురక్షితం చేయండి
• వారి గోప్యతను రక్షించడం — Family Linkలోని అనుమతుల నిర్వహణ మీ పిల్లల డేటా గురించి అర్థవంతమైన ఎంపికలను చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. Chrome ద్వారా యాక్సెస్ చేయబడిన వెబ్‌సైట్‌లు, ఎక్స్‌టెన్షన్‌లను, అలాగే మీ పిల్లల పరికరంలో డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌లను చూడండి, అనుమతులను మేనేజ్ చేయండి.
• వారి ఖాతాను సురక్షితం చేయడం — Family Link మీ పిల్లల ఖాతాను, డేటా సెట్టింగ్‌లను మేనేజ్ చేయడానికి మీకు యాక్సెస్‌ను అందిస్తుంది. తల్లిదండ్రులుగా, మీరు మీ చిన్నారి తన పాస్‌వర్డ్‌ను మరచిపోతే దానిని మార్చడంలో రీసెట్ చేయడంలో, వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎడిట్ చేయడంలో లేదా అవసరమనుకుంటే వారి ఖాతాను తొలగించడంలో కూడా మీరు సహాయం చేయవచ్చు.
ప���రయాణంలో కనెక్ట్ అయి ఉండండి
• వారు ఎక్కడ ఉన్నారో చూడటం — మీ ఫ్యామిలీని వారు ప్రయాణంలో ఉన్నప్పుడు కనుగొనడం సహాయకరంగా ఉంటుంది. Family Linkతో, మీ పిల్లలు తమ పరికరాన్ని తీసుకెళ్తున్నంత కాలం మీరు వారిని ఒకే మ్యాప్‌లో గుర్తించవచ్చు.
• నోటిఫికేషన్‌లు, అలర్ట్‌లను పొందటం — Family Link మీ చిన్నారి నిర్దిష్ట లొకేషన్‌కి వచ్చినప్పుడు లేదా వెళ్లినప్పుడు సహా కీలకమైన నోటిఫికేషన్‌లను అందిస్తుంది. మీరు పరికరాలను రింగ్ చేయవచ్చు, పరికరం మిగిలిన బ్యాటరీ జీవితకాలాన్ని కూడా చూడ��చ్చు.
ముఖ్యమైన సమాచారం
• మీ పిల్లల పరికరాన్ని బట్టి Family Link టూల్స్ మారుతూ ఉంటాయి. https://families.google.com/familylink/device-compatibility/
లింక్‌లో అనుకూల పరికరాల లిస్ట్ చూడండి
• Google Playలో మీ చిన్నారి చేసే కొనుగోళ్లు, డౌన్‌లోడ్‌లను మేనేజ్ చేయడంలో Family Link మీకు సహాయపడినా, యాప్ అప్‌డేట్‌లు, మీరు ముందే ఆమోదించిన యాప్‌లు (అదనపు అనుమతులు ఉండాల్సిన అప్‌డేట్‌లతో సహా) లేదా ఫ్యామిలీ లైబ్రరీలో షేర్ చేసిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి వారికి ఆమోదం అవసరం ఉండదు. అదనంగా, మీ చిన్నారి Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కొనుగోలు ఆమోదాలు వర్తిస్తాయి, ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ల ద్వారా చేస్తే వర్తించవు. తల్లిదండ్రులు Family Linkలో తమ పిల్లల ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను, వాటి అనుమతులను రెగ్యులర్‌గా రివ్యూ చేయాలి.
• మీరు మీ చిన్నారి పర్యవేక్షించబడే పరికరంలోని యాప్‌లను జాగ్రత్తగా రివ్యూ చేయాలి, వారికి తగని వాటిని నిలిపివేయాలి. మీరు Play, Google మొదలైన కొన్ని ముందే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను డిజేబుల్ చేయలేకపోవచ్చని గుర్తుంచుకోండి.
• మీ చిన్నారి లేదా యుక్తవయస్కుల పరికరం లొకేషన్‌ను చూడటానికి, పరికరం తప్పనిసరిగా ఆన్ చేయబడి, ఇటీవల యాక్టివ్‌గా ఉండి, డేటా లేదా wifi ద్వారా ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయి ఉండాలి.
• Family Link తల్లిదండ్రుల కంట్రోల్స్, పర్యవేక్షించబడే Google ఖాతాలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పర్యవేక్షించబడే Google ఖాతాలతో, పిల్లలు Search, Chrome, Gmail వంటి Google ప్రోడక్ట్‌లకు యాక్సెస్‌ను పొందుతారు, తల్లిదండ్రులు వాటిని పర్యవేక్షించడానికి ప్రాథమిక డిజిటల్ కనీస నియమాలను సెటప్ చేయవచ్చు.
• Family Link మీ పిల్లల ఆన్‌లైన్ అనుభవాన్ని మేనేజ్ చేయడానికి వారిని ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచడానికి టూల్స్‌ను అందించినప్పటికీ, ఇది ఇంటర్నెట్‌ను సురక్షితం చేయదు. Family Link ఇంటర్నెట్‌లోని కంటెంట్‌ను గుర్తించలేదు, కానీ అది వారి పిల్లలు తమ పరికరంలో సమయాన్ని ఎలా గడుపుతారో, మీ ఫ్యామిలీ ఆన్‌లైన్ భద్రతకు ఏ మార్గం సరైనదో నిర్ణయించుకొనేందుకు తల్లిదండ్రులకు అవకాశం ఇస్తుంది.
అప్‌డేట్ అయినది
13 డిసెం, 2024