అధికారిక Gmail యాప్, మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో Gmail అత్యుత్తమ ఫీచర్‌లను అందిస్తుంది, ఇందులో బలమైన భద్రత, రియల్ టైమ్ నోటిఫికేషన్‌లు, మల్టిపుల్ ఖాతా సపోర్ట్, మీ మెయిల్‌ల అన్నింటా పనిచేసే సెర్చ్ సర్వీస్ ఉన్నాయి. Wear OSలో కూడా Gmail అందుబాటులో ఉంది, మీరు మీ వాచ్ నుండే ప్రొడక్టివ్‌గా ఉండవచ్చు, ఈమెయిళ్లను మేనేజ్ చేయవచ్చు.
Gmail యాప్‌తో, మీరు వీటిని చేయగలరు:
• 99.9 కంటే ఎక్కువ శాతం స్పామ్, ఫిషింగ్, మాల్‌వేర్, హానికరమైన లింక్‌లు మీ ఇన్‌బాక్స్‌ను చేరకుండా ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయవచ్చు
• ఇబ్బందికరమైన తప్పులను నివారించడానికి, పంపిన మెయిల్‌ను రద్దు చేయవచ్చు
• ఇతరులతో కనెక్ట్ కావడానికి, క్రియేట్ చేయడానికి, సహకరించుకోవడానికి Google Chatను ఆన్ చేయవచ్చు
• Spacesలో ఒక గ్రూప్‌గా ఏర్పడి మరిన్ని చేయవచ్చు - ఇది వ్యక్తులను, టాపిక్‌లను, ప్రాజెక్ట్‌లను ఆర్గనైజ్ చేయడానికి కేటాయించిన స్థలం
• Google Meetతో అధిక క్వాలిటీ గల వీడియో కాలింగ్‌ను ఆనందించవచ్చు
• స్మార్ట్ రిప్లయి సూచనలతో ఈమెయిళ్లకు త్వరగా సమాధానం ఇవ్వవచ్చు
• మల్టిపుల్ ఖాతాల మధ్య మారవచ్చు
• ఫైళ్లను సులభంగా అటాచ్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు
• నోటిఫికేషన్ సెంటర్, బ్యాడ్జ్, లాక్ స్క్రీన్ ఆప్షన్‌లతో కొత్త మెయిల్ సమాచారాన్ని వేగంగా అందుకోవచ్చు
• మీరు టైప్ చేస్తున్నపుడు వచ్చే ఇన్‌స్టంట్ ఫలితాలు, సూచనలు, స్పెల్లింగ్ సూచనలతో మీ మెయిల్‌ను మరింత వేగంగా సెర్చ్ చేయవచ్చు
• లేబుల్ చేయడం, స్టార్ గుర్తు పెట్టడం, తొలగించడం, స్పామ్‌గా రిపోర్ట్ చేయడం ద్వారా మీ మెయిళ్లను ఆర్గనైజ్ చేసుకోవచ్చు.
•మీ ఇన్‌బాక్స్‌ను త్వరగా ఖాళీ చేయడానికి ఆర్కైవ్/తొలగించు వైపునకు స్వైప్ చేయవచ్చు
• థ్రెడ్ చేసిన సంభాషణలతో మీ మెయిల్‌ను చదవచ్చు
• మీరు Google Contacts లేదా ఫోన్ నుండి కాంటాక్ట్ పేర్లను టైప్ చేసేటప్పుడు ఆటో కంప్లీట్ చేయవచ్చు
• Google Calendar ఆహ్వానాలకు యాప్ నుండే సమాధానం ఇవ్వవచ్చు
• మీ ఈమెయిళ్ల క్విక్ ఓవర్‌వ్యూను పొందడానికి మీ Wear OS వాచ్‌లో Gmail కాంప్లికేషన్‌ను, టైల్‌ను జోడించవచ్చు
Gmail అనేది Google Workspaceలో భాగం, ఇది మీరు, మీ టీమ్ సులభంగా కనెక్ట్ అవ్వడానికి, క్రియేట్ చేయడానికి, సహకరించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు వీటిని చేయవచ్చు:
• Google Meet లేదా Google Chat, ద్వారా సహోద్యోగులతో కనెక్ట్ అవ్వడం, Calendarలో ఆహ్వానం పంపడం, మీ టాస్క్ లిస్ట్‌లో ఒక చర్యను జోడించడం, ఇంకా మరెన్నో Gmail నుండి నిష్క్రమించకుండా చేయవచ్చు
• మీరు మీ ముఖ్యమైన పనులను వెంటనే చేసేలా, సాధారణ టాస్క్‌లను త్వరగా చేసేలా సహాయపడే స్మార్ట్ రిప్లయి, స్మార్ట్ కంపోజ్, వ్యాకరణం సూచనలు, ఆటోమేటిక్ రిమైండర్‌ల లాంటి సూచించబడిన చర్యలను ఉపయోగించవచ్చు, తద్వారా మీరు మీ సమయాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు
• సురక్షితంగా ఉండండి మా మెషిన్ లెర్నింగ్ ��ోడల్స్, స్పామ్, ఫిషింగ్, మాల్‌వేర్ లాంటివి మా యూజర్‌లను చేరకుండా 99.9%కు మించి బ్లాక్ చేస్తాయి
Google Workspace గురించి మరింత తెలుసుకోండి: https://workspace.google.com/products/gmail/
మరింత సమాచారం కోసం ఈ ఫ్లాట్‌ఫామ్‌లలో మమ్మల్ని ఫాలో అవ్వండి:
Twitter: https://twitter.com/googleworkspace
LinkedIn: https://www.linkedin.com/showcase/googleworkspace
Facebook: https://www.facebook.com/googleworkspace/
అప్‌డేట్ అయినది
10 డిసెం, 2024