మీరు Google Play నుండి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు, మీరు యాప్ డేటా భద్రతా విభాగాన్ని చెక్ చేయవచ్చు. డెవలపర్‌లు, తమ యాప్ మీ డేటాను ఎలా హ్యాండిల్ చేస్తుందనే దాని గురించి సమాచారాన్ని షేర్ చేయడానికి డేటా భద్రతా విభాగాన్ని ఉపయోగిస్తారు. ఈ విధంగా, మీరు ఏ యాప్‌లను ఉపయోగిస్తున్నారనే దాని గురించి మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చు.
యాప్ డేటా భద్రతా సమాచారాన్ని కనుగొనండి
- Google Play ను తెరవండి.
- యాప్‌ను కనుగొనడానికి బ్రౌజ్ చేయండి లేదా సెర్చ్ బార్‌ను ఉపయోగించండి.
- యాప్‌ను ట్యాప్ చేయండి.
- "డేటా భద్రత" విభాగంలో, మీరు యాప్ డేటా భద్రతా ప్రాక్టీసుల సారాంశాన్ని కనుగొంటారు.
- మరిన్ని వివరాల కోసం, వివరాలను చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: డేటా భద్రతా విభాగంలోని సమాచారం, కేవలం Google Playలో పంపిణీ చేయబడిన యాప్‌లకు మాత్రమే వర్తిస్తుంది. మీరు Android 5, అంతకంటే తాజా వెర్షన్‌లలో మాత్రమే డేటా భద్రతా విభాగాన్ని కనుగొంటారు.
యాప్ డేటా భద్రతా ప్రాక్టీసులను అర్ధం చేసుకుని రివ్యూ చేయండి
డెవలపర్‌లు తమ యాప్‌లు, వివిధ రకాల డేటాను ఎలా సేకరిస్తున్నాయి, షేర్ చేస్తున్నాయి, అలాగే ఎలా హ్యాండిల్ చేస్తున్నాయి అని వివరించడానికి, యాప్ లిస్టింగ్‌లోని డేటా భద్రతా విభాగం అనుమతిస్తుంది. డెవలపర్‌లు వారి ప్రాక్టీసులను దీనికోసం వివరిస్తారు:
- డేటా సేకరణ: డెవలపర్‌లు తమ యాప్ సేకరిస్తున్న యూజర్ డేటా రకాలు, వారు ఈ డేటాను ఎలా ఉపయోగిస్తున్నారు ఇంకా ఈ డేటా సేకరణ ఆప్షనల్‌గా చేయబడుతుందా లేదా అని వివరిస్తారు. మీ పరికరం నుండి డేటాను తిరిగి పొందడానికి, డెవలపర్ వారి యాప్‌ను ఉపయోగించినప్పుడు డేటా సాధారణంగా "సేకరించినది"గా పరిగణించబడుతుంది.
- కొన్ని సందర్భాల్లో, డేటా సాంకేతికంగా మీ పరికరం నుండి నిష్క్రమించినప్పటికీ, డెవలపర్‌లు డేటాను "సేకరించినది"గా వెల్లడించాల్సిన అవసరం లేదు (ఉదాహరణకు, డేటా తాత్కాలికంగా మాత్రమే ప్రాసెస్ చేయబడినప్పుడు). ఈ డేటా సందర్భాల గురించి దిగువున మరింత తెలుసుకోండి.
- డేటా షేరింగ్: డెవలపర్‌లు, తమ యాప్ మీ డేటాను థర్డ్ పార్టీలతో షేర్ చేస్తుందో లేదో, ఇంకా ఏ రకమైన డేటా షేర్ చేయబడుతుందో వివరిస్తారు. యాప్ ద్వారా యాక్సెస్ చేయబడినప్పుడు, థర్డ్-పార్టీకి బదిలీ చేసినప్పుడు, డేటా సాధారణంగా "షేర్ చేయబడినది"గా పరిగణించబడుతుంది.
- కొన్ని సందర్భాల్లో, డెవలపర్‌లు డేటాను సాంకేతికంగా మరొక పార్టీకి బదిలీ చేసినప్పటికీ "షేర్ చేయబడినది"గా వెల్లడించాల్సిన అవసరం లేదు (ఉదాహరణకు, యాప్ డేటాను ఎలా ఉపయోగిస్తుందో వివరించిన తర్వాత మీరు డేటాను బదిలీ చేయడానికి మీ సమ్మతిని ఇచ్చినప్పుడు లేదా డెవలపర్ సర్వీస్ ప్రొవైడర్‌తో డేటా షేర్ చేయబడినప్పుడు). ఈ డేటా సందర్భాల గురించి దిగువున మరింత తెలుసుకోండి.
డెవలపర్‌లు, Google Playలో పంపిణీ చేయబడిన యాప్‌నకు చెందిన అన్ని వెర్షన్‌లలో తమ యాప్ డేటా కలెక్షన్, ఇంకా షేరింగ్ మొత్తాన్ని వివరించడానికి Google Play డేటా భద్రతా విభాగాన్ని ఉపయోగిస్తారు. యాప్ డేటా గోప్యత ఇంకా సెక్యూరిటీ ప్రాక్టీస్‌లు, మీ వినియోగం, ప్రాంతం, ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్‌లు తమ యూజర్‌లతో యాప్ వెర్షన్ గురించిన నిర్దిష్ట సమాచారాన్ని షేర్ చేయడానికి, యాప్ Google Play లిస్టింగ్, గోప్యతా పాలసీ లేదా ఇతర డాక్యుమెంటేషన్‌లోని “ఈ యాప్ గురించి” అనే విభాగాన్ని వారు ఉపయోగించవచ్చు.
డేటా సేకరణ & డేటా షేరింగ్ గురించి అర్థం చేసుకోండి
డేటా సేకరణకింది సందర్భాలలో, డెవలపర్‌లు ఒక యాప్ ద్వారా యాక్సెస్ చేయబడిన డేటాను డేటా సేఫ్టీ విభాగంలో "సేకరించినది"గా బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు:
- యాప్ మీ పరికరంలోని డేటాను మాత్రమే యాక్సెస్ చేసి, అది మీ పరికరం నుండి పంపకుండా ఉన్నట్లయితే. ఉదాహరణకు, మీరు మీ లొకేషన్‌ను యాక్సెస్ చేయడానికి యాప్‌నకు అనుమతులు అందించినప్పటికీ, అది మీ పరికరంలో యాప్ ఫంక్షనాలిటీని అందించడానికి మాత్రమే ఆ డేటాను ఉపయోగిస్తూ, దాని సర్వర్‌కు దాన్ని పంపకపోతే, అది సేకరించినట్లుగా ఆ డేటాను బహిర్గతం చేయవలసిన అవసరం లేదు.
- పరికరం నుండి మీ డేటా పంపబడి, తాత్కాలికంగా మాత్రమే ��్రాసెస్ చేయబడినప్పుడు. దీని అర్థం, డెవలపర్ మీ డేటాను మెమరీలో స్టోర్ చేసినప్పుడు మాత్రమే యాక్సెస్ చేసి, ఉపయోగిస్తారు, ఇంకా నిర్దిష్ట రిక్వెస్ట్ కోసం సర్వీస్‌ను అందించడానికి, అవసరమైన సమయం వరకు మాత్రమే వారి వద్ద డేటా ఉంటుంది. ఉదాహరణకు, మీ లొకేషన్‌లో ప్రస్తుత వాతావరణాన్ని పొందడానికి, వాతావరణ యాప్ మీ పరికరం నుండి మీ లొకేషన్‌ను పంపినప్పటికీ, మెమరీలో ఉన్న మీ లొకేషన్ డేటాను మాత్రమే యాప్ ఉపయోగిస్తుంది అలాగే వాతావరణాన్ని అందించడానికి అవసరమైన దానికంటే ఎక్కువ సమయం డేటాను స్టోర్ చేయదు.
- మీ డేటా పూర్తి స్థాయి ఎన్‌క్రిప్షన్ ఉపయోగించి పంపబడినప్పుడు. దీని అర్థం, డేటా పంపినవారు, అందుకున్నవారు తప్ప మరెవరూ చదవలేరు. ఉదాహరణకు, మీరు పూర్తి స్థాయి ఎన్‌క్రిప్షన్‌తో మెసేజింగ్ యాప్‌ను ఉపయోగించి ఫ్రెండ్‌కు మెసేజ్ పంపినట్లయితే, మీరు, మీ ఫ్రెండ్ మాత్రమే మెసేజ్‌ను చదవగలరు.
కొన్నిసార్లు యాప్‌లు, నిర్దిష్ట చర్యను పూర్తి చేయడానికి, మిమ్మల్ని వేరే సర్వీస్‌కు మళ్లించవచ్చు. ఉదాహరణకు, ఏదైనా కొనుగోలును పూర్తి చేయడానికి, ఒక యాప్ మిమ్మల్ని PayPal, Google Pay వంటి పేమెంట్ సర్వీస్‌కు లేదా అలాంటి మరొక సర్వీస్‌కు మళ్లించవచ్చు. ఈ సందర్భాలలో, యాప్ డెవలపర్ ఇతర సర్వీస్ ద్వారా సేకరించిన డేటాను ప్రకటించాల్సిన అవసరం లేదు:
- యాప్ ఈ సమాచారాన్ని యాక్సెస్ చేయనప్పుడు, అలాగే
- ఆ సర్వీస్ గోప్యతా పాలసీ, సర్వీస్ నియమాల ప్రకారం ఈ సమాచారాన్ని నేరుగా మీరు ఇతర సర్వీస్‌కు అందిజేసినప్పుడు.
కొన్ని సందర్భాల్లో, డేటా భద్రతా విభాగంలో ఇతరులకు బదిలీ చేయబడిన డేటాను "షేర్ చేయబడినది"గా యాప్ డెవలపర్‌లు ప్రకటించాల్సిన అవసరం లేదు. ఇది, కింద పేర్కొన్న సందర్భాలతో కూడి ఉంటుంది:
- మీరు డేటా షేర్ చేయబడుతుందని ఆశించి ప్రారంభించే నిర్దిష్ట చర్య ఆధారంగా డేటా థర్డ్-పార్టీకి బదిలీ చేయబడినప్పుడు. ఉదాహరణకు, మీరు మరొక వ్యక్తికి ఈమెయిల్ పంపినప్పుడు లేదా డాక్యుమెంట్‌ను షేర్ చేసినప్పుడు.
- థర్డ్-పార్టీకి డేటా బదిలీ అనేది యాప్‌లో ప్రముఖంగా బహిర్గతం చేయబడుతుంది, అలాగే Google Play యూజర్ డేటా పాలసీ ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండే విధంగా, యాప్ మీ సమ్మతి కోసం రిక్వెస్ట్ చేస్తుంది.
- డెవలపర్ తరపున ప్రాసెస్ చేయడానికి, సర్వీస్ ప్రొవైడర్‌కు డేటా బదిలీ చేయబడుతుంది. ఉదాహరణకు, డెవలపర్ తమ తరపున డేటాను హోస్ట్ చేయడానికి, డెవలపర్ సూచనలు, ఒప్పంద నియమాలు, గోప్యతా పాలసీలు, ఇంకా సెక్యూరిటీ స్టాండర్డ్‌లకు అనుగుణంగా సర్వీస్ ప్రొవైడర్‌ను ఉపయోగించుకోవచ్చు.
- ప్రభుత్వ రిక్వెస్ట్‌కు ప్రతిస్పందించడం వంటి నిర్దిష్ట చట్టపరమైన ప్రయోజనాల కోసం డేటా బదిలీ చేయబడుతుంది.
- బదిలీ చేయబడిన డేటా పూర్తిగా అనామకంగా ఉంటుంది, కాబట్టి ఇది ఇకపై ఏ వ్యక్తితోనూ అనుబంధించబడదు.
డేటా భద్రతా విభాగంలోని ఇతర సమాచారం
సెక్యూరిటీ ప్రాక్టీసులుడెవలపర్లు వారు ఉపయోగించే కొన్ని భద్రతా పద్ధతులను వివరించవచ్చు. దీనిలో భాగంగా వారి యాప్ కింద పేర్కొన్న సందర్భాలలో ఉంటే:
- అది ట్రాన్సిట్‌లో ఉన్నప్పుడు, అది సేకరించిన లేదా షేర్ చేసిన డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి ఉంటే.
- మీ డేటాను ఇతర సైట్ లేదా సర్వీస్‌కు మీరు బదిలీ చేయడానికి అనుమతించేందుకు కొన్ని యాప్‌లు రూపొందించబడ్డాయి. మీ పరికరం నుంచి యాప్‌లకు చెందిన సర్వర్‌లకు మీ డేటా వెళుతున్నప్పుడు దాన్ని సురక్షితంగా ఎన్‌క్రిప్ట్ చేసేందుకు ఈ యాప్‌లు, ఇండస్ట్రీకి సంబంధించిన ఉత్తమ స్టాండర్డ్‌లను ఉపయోగించినంత వరకు డేటా, సురక్షిత కనెక్షన్ ద్వారా బదిలీ అవుతోంది అని అవి, త�� డేటా భద్రతా విభాగంలో ప్రకటన చేయవచ్చు. మీ డేటాను బదిలీ చేయడానికి మీరు ఎంచుకునే సైట్‌లు లేదా సర్వీస్‌లు విభిన్నమైన గోప్యతా పద్ధతులను, సెక్యూరిటీ ప్రాక్టీసులను కలిగి ఉండవచ్చు. మీ డేటాను మీరు సురక్షిత గమ్యస్థానాలకు బదిలీ చేస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఆ ప్రాక్టీసులను స్వతంత్రంగా రివ్యూ చేయండి. ఉదాహరణకు, ట్రాన్సిట్‌లో మీ డేటాను ఎన్‌క్రిప్ట్ చేస్తుందని ప్రకటించే మెసేజింగ్ యాప్ మీ మొబైల్ సర్వీస్‌ల ప్రొవైడర్ ద్వారా SMS మెసేజ్‌ను పంపడానికి మీకు ఆప్షన్ ఇవ్వవచ్చు. మీ మొబైల్ సర్వీస్‌ల ప్రొవైడర్ దాని మొబైల్ నెట్‌వర్క్ ద్వారా సురక్షితంగా SMS మెసేజ్‌లను పంపడానికి ట్రాన్సిట్‌లో ఎన్‌క్రిప్షన్ ఉపయోగించకపోవచ్చు కాబట్టి దాని డేటా హ్యాండ్లింగ్ ప్రాక్టీసులను మీరు రివ్యూ చేయాలి.
- వారి యాప్, గ్లోబల్ సెక్యూరిటీ స్టాండర్డ్‌కు అనుగుణంగా ఉందా లేదా అని స్వతంత్ర సంస్థ ద్వారా రివ్యూ చేయబడినట్లయితే. స్వతంత్ర సంస్థ చేసే ఈ రివ్యూ యాప్ సెక్యూరిటీ ప్రాక్టీసులను గ్లోబల్ స్టాండర్డ్‌తో పోల్చి చూస్తూ వాలిడేట్ చేస్తుంది. యాప్‌లను రివ్యూ చేసే థర్డ్-పార్టీ సంస్థలు డెవలపర్‌ల తరఫున రివ్యూలు చేస్తున్నాయి. ఈ రివ్యూ, డెవలపర్ డేటా భద్రతా విభాగం బహిర్గత ప్రకటన ఖచ్చితత్వాన్ని, సంపూర్ణతను వెరిఫై చేయదు.
- యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా పేమెంట్‌లను ఆఫర్ చేస్తుంది. UPI ఒక తక్షణ నగదు బదిలీ వ్యవస్థ. ఇది, RBI-నియంత్రిత సంస్థ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా అభివృద్ధి చేయబడింది. ఈ యాప్ UPI అమలును NPCI వెరిఫై చేసిందని, ధృవీకరించిందని డెవలపర్‌లు సూచిస్తున్నారు. భారతదేశంలో యాప్ వినియోగం కోసం మాత్రమే, ఈ సెక్యూరిటీ ప్రాక్టీస్ అందుబాటులో ఉంది.
యాప్‌లోని మీ డేటాను తీసివేయడానికి డెవలపర్‌లు మీకు ఏ మార్గాలను అందిస్తారో వివరించడానికి డేటా తొలగింపు విభాగం అనుమతిస్తుంది.
కొన్ని యాప్‌లు మీకు ఖాతాను క్రియేట్ చేయగల సామర్థ్యాన్ని ఆఫర్ చేయవచ్చు. ఖాతా క్రియేషన్‌ను ఆఫర్ చేసే యాప్‌లు తప్పనిసరిగా:
- యూజర్‌లు వారి యాప్ ఖాతాలు, అనుబంధిత డేటాను తొలగించడానికి యాప్‌లో పాత్‌ను అందించాలి.
- యూజర్‌లు యాప్ ఖాతా తొలగింపు, అనుబంధిత డేటా తొలగింపును రిక్వెస్ట్ చేయగల వెబ్ లింక్ రిసోర్స్‌ను అందించాలి.
ఖాతా క్రియేషన్‌ను ఆఫర్ చేసే కొన్ని యాప్‌లు మీ మొత్తం ఖాతాను తొలగించకుండానే నిర్దిష్ట యాప్ డేటాను తొలగించే ఆప్షన్‌ను కూడా మీకు అందించవచ్చు.
ఇతర యాప్‌లు ఖాతా క్రియేషన్‌ను ఆఫర్ చేయవు, కానీ మీ అనుబంధిత డేటాను తొలగించడానికి మీకు మార్గాన్ని అందించవచ్చు. మీ డేటా తొలగింపును ఎలా రిక్వెస్ట్ చేయాలి, డెవలపర్ డేటా తొలగింపు రిక్వెస్ట్‌లకు ఎలా సమాధానమిస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది తెలుసుకోవడానికి:
యాప్‌ల కోసం Google Play ఖాతా తొలగింపు ఆవశ్యకత గురించి మరింత తెలుసుకోండి.ఖాతా మేనేజ్‌మెంట్ డేటా ఇంకా సిస్టమ్ సర్వీస్‌లకు సంబంధించిన బహిర్గత ప్రకటనల గురించి మరింత తెలుసుకోండి.
ఖాతా మేనేజ్‌మెంట్
కొన్ని యాప్‌లు, డెవలపర్ తన సర్వీస్‌లంత���ా ఉపయోగించే ఖాతాను క్రియేట్ చేయడానికి లేదా ఖాతాకు సమాచారాన్ని జోడించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. యాప్ ద్వారా సేకరించిన ఖాతా డేటాను మోసాలను నివారించడానికి లేదా అడ్వర్టయిజింగ్ వంటి యాప్‌నకు నిర్దిష్టం కాని తమ సర్వీస్‌లలో అదనపు ప్రయోజనాల కోసం డెవలపర్ ఉపయోగించవచ్చు. ఈ సేకరణను, అలాగే వారి సర్వీస్‌లలో ఖాతా డేటాను ఉపయోగించడాన్ని "ఖాతా మేనేజ్‌మెంట్"గా డెవలపర్‌లు వెల్లడించవచ్చు. యాప్ స్వయంగా డేటాను ఉపయోగించే అన్ని ప్రయోజనాలను తప్పనిసరిగా డెవలపర్‌లు ప్రకటించాలి. డెవలపర్ తమ సర్వీస్‌లలో మీ ఖాతా డేటాను ఎలా ఉపయోగిస్తారో అర్థం చేసుకోవడానికి, యాప్ గోప్యతా పాలసీ వంటి యాప్ సమాచారాన్ని రివ్యూ చేయండి.
సిస్టమ్ సర్వీస్‌లు
సిస్టమ్ సర్వీస్‌లు అనేవి, కొన్ని పరికరాలలో ముందే ఇన్‌స్టాల్ చేయబడిన సాఫ్ట్‌వేర్, ఇవి అన్‌ఇన్‌స్టాల్ చేయబడవు. అవి పరికర-నిర్దిష్ట ఫీచర్‌లు లేదా ఫంక్షన్‌లను సపోర్ట్ చేస్తాయి. డేటా భద్రతా విభాగాన్ని పూర్తి చేయడానికి, అర్హత గల సిస్టమ్ సర్వీస్‌ల డెవలపర్‌లు అవసరం లేదు. మీరు డెవలపర్ సైట్, గోప్యతా పాలసీని రివ్యూ చేసి వారి డేటా భద్రతా ప్రాక్టీసుల గురించి మరింత తెలుసుకోవచ్చు.
డేటా భద్రతా విభాగంలో కవర్ చేయబడిన డేటా రకాలు, డేటా సేకరణ ప్రయోజనాలు
డేటా భద్రతా విభాగం, నిర్దిష్ట రకాల డేటాను సేకరించడం, షేర్ చేయడం వంటి వాటి గురించిన ప్రయోజనాన్ని వివరిస్తుంది. ఈ ప్రయోజనాలను వివరించడానికి డెవలపర్‌లు తప్పనిసరిగా అదే కేటగిరీలను ఉపయోగించాలి, తద్వారా మీరు మల్టిపుల్ యాప్‌లను స్థిరంగా సరిపోల్చవచ్చు. యాప్ సంబంధించిన అన్ని వెర్షన్‌లను, వైవిధ్యాల గురించి సమాచారం వివరించాలి.
డేటా భద్రతా విభాగంలో చేర్చబడిన డేటా రకాలు, ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.
కేటగిరీ | డేటా రకం | వివరణ |
---|---|---|
లొకేషన్ | రమారమి లొకేషన్ |
మీరు ఉన్న నగరం వంటి 3 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదా దానికి సమానమైన ప్రాంతానికి సంబంధించి మీది లేదా మీ పరికరం భౌతిక లొకేషన్. |
ఖచ్చితమైన లొకేషన్ | మీరు ఉన్న నగరం వంటి 3 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ లేదా దానికి సమానమైన ప్రాంతానికి సంబంధించి మీది లేదా మీ పరికరం భౌతిక లొకేషన్. | |
వ్యక్తిగత సమాచారం | పేరు |
మీ మొదటి లేదా చివరి పేరు లేదా మారుపేరు వంటి వాటి ద్వారా మిమ్మల్ని మీరు ఎలా సూచించగలరో తెలియజేయడం. |
ఈమెయిల్ అడ్రస్ | మీ ఈమెయిల్ అడ్రస్. | |
యూజర్ IDలు | గుర్తించదగిన వ్యక్తికి సంబంధించిన ఐడెంటిఫైయర్‌లు. ఉదాహరణకు, ఖాతా ID, ఖాతా నంబర్ లేదా ఖాతా పేరు. | |
అడ్రస్ |
మెయిలింగ్ లేదా ఇంటి అడ్రస్ లాంటి వాటితో కూడిన మీ అడ్రస్. |
|
ఫోన్ నంబర్ | మీ ఫోన్ నంబర్. | |
జాతి, జాతిపరమైనవి |
మీ జాతి లేదా జాతిపరమైన సమాచారం. |
|
రాజకీయ లేదా మతపరమైన నమ్మకాలు |
మీ రాజకీయ లేదా మతపరమైన నమ్మకాల గురించిన సమాచారం. |
|
లైంగిక ధోరణి |
మీ లైంగిక ధోరణి గురించిన సమాచారం. |
|
ఇతర సమాచారం |
పుట్టిన తేదీ, లింగ గుర్తింపు, వెటరన్ స్టేటస్ మొదలగు ఏదైనా ఇతర వ్యక్తిగత సమాచారం. |
|
ఆర్థిక సమాచారం | యూజర్ పేమెంట్ సమాచారం |
క్రెడిట్ కార్డ్ నంబర్ వంటి మీ ఆర్థిక ఖాతాలకు సంబంధించిన సమాచారం. |
కొనుగోలు హిస్టరీ |
మీరు చేసిన కొనుగోళ్లు లేదా లావాదేవీల గురించిన సమాచారం. |
|
క్రెడిట్ స్కోర్ |
మీ క్రెడిట్ గురించిన సమాచారం. ఉదాహరణకు, మీ క్రెడిట్ హిస్టరీ లేదా క్రెడిట్ స్కోర్. |
|
ఇతర ఆర్థిక సమాచారం |
మీ జీతం లేదా అప్పులు వంటి ఏదైనా ఇతర ఆర్ధిక సమాచారం. |
|
ఆరోగ్యం, ఫిట్‌నెస్ | ఆరోగ్య సమాచారం |
��ైద్య రికార్డులు లేదా లక్షణాలు వంటి మీ ఆరోగ్యం గురించిన సమాచారం. |
ఫిట్‌నెస్ సమాచారం |
వ్యాయామం లేదా ఇతర శారీరక శ్రమ వంటి మీ ఫిట్‌నెస్ గురించిన సమాచారం. |
|
మెసేజ్‌లు | ఈమెయిల్‌లు |
ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్, పంపినవారు, గ్రహీతలు ఇంకా ఈమెయిల్ కంటెంట్‌తో కూడిన మీ ఈమెయిల్‌లు. |
SMS లేదా MMS |
పంపినవారు, గ్రహీతలు ఇంకా మెసేజ్‌లోని కంటెంట్‌తో కూడిన మీ టెక్స్ట్ మెసేజ్‌లు. |
|
ఇతర యాప్‌లో మెసేజ్‌లు |
ఇంకా ఏవైనా ఇతర రకాల మెసేజ్‌లు. ఉదాహరణకు, ఇన్‌స్టంట్ మెసేజ్‌లు లేదా చాట్ కంటెంట్. |
|
ఫోటోలు, వీడియోలు | ఫోటోలు | మీ ఫోటోలు. |
వీడియోలు | మీ వీడియోలు. | |
ఆడియో ఫైళ్లు | వాయిస్ లేదా సౌండ్ రికార్డింగ్‌లు |
వాయిస్ మెయిల్ లేదా సౌండ్ రికార్డింగ్ వంటి మీ వాయిస్. |
మ్యూజిక్ ఫైళ్లు |
మీ మ్యూజిక్ ఫైళ్లు. |
|
ఇతర ఆడియో ఫైళ్లు |
మీరు క్రియేట్ చేసిన లేదా అందజేసిన ఏదైనా ఇతర ఆడియో ఫైళ్లు. |
|
ఫైళ్లు, డాక్యుమెంట్‌లు | ఫైళ్లు, డాక్యుమెంట్‌లు |
మీ ఫైల్‌లు లేదా డాక్యుమెంట్‌లు లేదా ఫైల్ పేర్ల వంటి మీ ఫైళ్లు లేదా డాక్యుమెంట్‌ల గురించిన సమాచారం. |
క్యాలెండర్ | క్యాలెండర్ ఈవెంట్‌లు |
మీ క్యాలెండర్ నుండి, ఈవెంట్‌లు, ఈవెంట్ నోట్‌లు ఇంకా హాజరైనవారి వంటి సమాచారం. |
కాంటాక్ట్‌లు | కాంటాక్ట్‌లు |
కాంటాక్ట్ పేర్లు, మెసేజ్ హిస్టరీ, వంటి మీ కాంటాక్ట్‌ల గురించిన సమాచారం, యూజర్‌నేమ్‌లు, కాంటాక్ట్ రీసెన్సీ, కాంటాక్ట్ ఫ్రీక్వెన్సీ, ఇంటరాక్షన్ వ్యవధి ఇంకా కాల్ హిస్టరీ వంటి సోషల్ గ్రాఫ్ సమాచారం. |
యాప్ యాక్టివిటీ | యాప్ ఇంటరాక్షన్‌లు |
మీరు యాప్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారనే దాని గురించిన సమాచారం. ఉదాహరణకు, మీరు ట్యాప్ చేసిన పేజీ లేదా విభాగాలను సందర్శించిన సంఖ్య. |
యాప్‌లో సెర్చ్ హిస్టరీ | మీరు యాప్‌లో సెర్చ్ చేసిన వాటి గురించిన సమాచారం. | |
ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు | మీ పరికరంలో ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌ల గురించిన సమాచారం. | |
ఇతర యూజర్ రూపొందించిన కంటెంట్ |
మీరు రూపొందించిన ఏదైనా ఇతర కంటెంట్ ఇక్కడ లిస్ట్ చేయబడదు లేదా మరే ఇతర విభాగంలోనూ ఉండదు. ఉదాహరణకు, bios, నోట్స్ లేదా ఓపెన్-ఎండెడ్ రెస్పాన్స్‌లు. |
|
ఇతర చర్యలు |
గేమ్ ఆడే విధానం, లైక్‌లు, డైలాగ్ ఆప్షన్‌లు వంటి ఏదైనా ఇతర యాక్టివిటీ లేదా యాప్‌లోని చర్యలు ఇక్కడ లిస్ట్ చేయబడవు. |
|
వెబ్ బ్రౌజింగ్ | వెబ్ బ్రౌజింగ్ హిస్టరీ |
మీరు సందర్శించిన వెబ్‌సైట్‌ల గురించిన సమాచారం. |
యాప్ సమాచారం, పనితీరు | క్రాష్ లాగ్‌లు |
యాప్ నుండి క్రాష్ డేటా. ఉదాహరణకు, పరికరంలో యాప్ ఎన్నిసార్లు క్రాష్ అయ్యింది లేదా క్రాష్‌కు సంబంధించిన ఇతర ప్రత్యక్ష సమాచారం. |
సమస్య విశ్లేషణలు |
పరికరంలో యాప్ పనితీరు గురించిన సమాచారం. ఉదాహరణకు, బ్యాటరీ జీవితకాలం, లోడ్ అయ్యే సమయం, ప్రతిస్పందన సమయం, ఫ్రేమ్‌రేట్ లేదా ఏవైనా సమస్య విశ్లేషణలు. |
|
ఇతర యాప్ పనితీరు డేటా |
ఇక్కడ లిస్ట్ చేయబడని ఏదైనా ఇతర యాప్ పనితీరు డేటా. |
|
పరికరం లేదా ఇతర IDలు | పరికరం లేదా ఇతర IDలు |
వ్యక్తిగత పరికరం, బ్రౌజర్ లేదా యాప్‌నకు సంబంధించిన ఐడెంటిఫైయర్‌లు. ఉదాహరణకు, IMEI నంబర్, MAC అడ్రస్, Widevine పరికర ID, Firebase ఇన్‌స్టాలేషన్ ID లేదా అడ్వర్టయిజింగ్ ఐడెంటిఫయర్. |
డేటా ప్రయోజనాలు | వివరణ | ఉదాహరణ |
---|---|---|
ఖాతా మేనేజ్‌మెంట్ | డెవలపర్‌తో మీ ఖాతా సెటప్ లేదా మేనేజ్‌మెంట్ కోసం ఉపయోగించబడుతుంది. |
ఉదాహరణకు, కింద పేర్కొన్న వాటికోసం మిమ్మల్ని అనుమతించడానికి:
|
అడ్వర్టయిజింగ్ లేదా మార్కెటింగ��� | యాడ్‌లను డిస్‌ప్లే చేయడానికి లేదా టార్గెట్ చేయడానికి లేదా మార్కెటింగ్ కమ్యూనికేషన్‌లకు, యాడ్ పనితీరును కొలవడానికి ఉపయోగించడం జరుగుతుంది. | ఉదాహరణకు, మీ యాప్‌లో యాడ్‌లను డిస్‌ప్లే చేయడం, ఇతర ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌లను ప్రమోట్ చేయడానికి పుష్ నోటిఫికేషన్‌లను పంపడం లేదా అడ్వర్టయిజింగ్ పార్ట్‌నర్‌లతో డేటాను షేర్ చేసుకోవడం లాంటివి. |
యాప్ ఫంక్షనాలిటీ | యాప్‌లో లభ్యమయ్యే ఫీచర్‌ల కోసం ఉపయోగించబడుతుంది. | ఉదాహరణకు, యాప్ ఫీచర్‌లను ఎనేబుల్ చేయడానికి లేదా మిమ్మల్ని ప్రామాణీకరించడానికి. |
ఎనలిటిక్స్ | మీరు యాప్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు లేదా అది ఎలా పని చేస్తుంది అనే దాని గురించి డేటాను సేకరించడానికి ఉపయోగించబడుతుంది. | ఉదాహరణకు, నిర్దిష్ట ఫీచర్‌ను ఎంత మంది యూజర్‌లు ఉపయోగిస్తున్నారో చూడటానికి, యాప్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, బగ్‌లు లేదా క్రాష్‌ల సమస్య విశ్లేషణ చేసి వాటిని పరిష్కరించడానికి లేదా భవిష్యత్తులో పనితీరు మెరుగుదలలను చేయడానికి. |
డెవలపర్ కమ్యూనికేషన్స్ |
యాప్ లేదా డెవలపర్ గురించిన వార్తలు లేదా నోటిఫికేషన్‌లను పంపడానికి ఉపయోగించడం జరుగుతుంది. |
ఉదాహరణకు, యాప్‌లోని కొత్త ఫీచర్‌లు లేదా ముఖ్యమైన సెక్యూరిటీ అప్‌డేట్ గురించి మీకు తెలియజేయడానికి పుష్ నోటిఫికేషన్‌ను పంపడం మొదలగునవి. |
మోసాన్ని అరికట్టడం, సెక్యూరిటీ ఇంకా అనుకూలత |
మోసం నివారణకు, భద్రత లేదా చట్టాలకు సంబంధించి అనుకూలతకు ఉపయోగించబడుతుంది. |
ఉదాహరణకు, మోసపూరిత యాక్టివిటీని గుర్తించడానికి, విఫలమైన లాగిన్ ప్రయత్నాలను పర్యవేక్షించడం మొదలగునవి. |
వ్యక్తిగతీకరణ |
సిఫార్సు చేయబడిన కంటెంట్ లేదా సూచనలను చూపడం ద్వారా మీ యాప్‌ను అనుకూలీకరించడానికి ఉపయోగించబడుతుంది. |
ఉదాహరణకు, మీ వినే అలవాట్ల ఆధారంగా ప్లేలిస్ట్‌లను సూచించడం లేదా మీ లొకేషన్ ఆధారంగా స్థానిక వార్తలను అందించడం మొదలగునవి. |
యాప్ అనుమతులను & డేటా కలెక్షన్‌ను కంట్రోల్ చేయండి
యాప్ అనుమతులను అర్థం చేసుకోండిఎలాంటి నిర్దిష్ట డేటాను లేదా ఫీచర్‌లను యాప్ యాక్సెస్ చేయగలదో, లేదా వేటి యాక్సెస్ కోసం రిక్వెస్ట్ చేస్తుందో, వాటిని యాప్ అనుమతుల లిస్ట్ చూపుతుంది. ఈ లిస్ట్‌లో ఇవి ఉంటాయి:
- యాప్ పని చేయడానికి అవసరమైన డేటా లేదా ఫీచర్‌లు, అంటే మొబైల్ నెట్‌వర్క్ యాక్సెస్ లాంటివి
- మీరు యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు అది రిక్వెస్ట్ చేసే డేటా, అంటే మీ కెమెరా యాక్సెస్ కోసం రిక్వెస్ట్ చేయడం లాంటివి
డెవలపర్ యాప్ ఎలా పని చేస్తుందనే దాన్ని వివరించే సాంకేతిక సమాచారం ఆధారంగా లిస్ట్ ఉంటుంది. యాప్ డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు ఇంకా ఎలా హ్యాండిల్ చేస్తారు అనే దాని గురించి వారు ప్రకటించిన సమాచారం ఆధారంగా ఉండే డేటా భద్రతా విభాగానికి, ఇది భిన్నంగా ఉంటుంది.
కొన్నిసార్లు, యాప్ అనుమతుల లిస్ట్‌లో సమాచారం, డేటా భద్రతా విభాగంలో ఉన్న దానికి భిన్నంగా ఉండవచ్చు. దీనికి కారణాలు కాగల కొన్ని ఇక్కడ ఉన్నాయి:
- పరికరంలో డేటాను ప్రాసెస్ చేయడానికి, యాప్ దాన్ని యాక్సెస్ చేస్తుంది, కానీ దానిని కలెక్ట్ చేయదు లేదా షేర్ చేయదు.
- అనుమతులచే మేనేజ్ చేయబడని విధంగా, యాప్ డేటాను సేకరిస్తుంది.
- అనుమతుల లిస్ట్‌లో ఉండే సర్వీస్ లేదా డేటా రకం, డేటా భద్రతా విభాగంలో కవర్ చేయబడలేదు.
మీరు ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, మీ డేటాను యాక్సెస్ చేయడానికి యాప్ తప్పనిసరిగా అనుమతిని అడగాలి. మీరు ��ేర్ చేయడానికి ఇష్టపడని డేటాను యాప్ సేకరిస్తే, మీరు ఈ విధంగా చేయవచ్చు:
- మీ ఫోన్ సెట్టింగ్‌లలో, కేవలం ఒక యాప్ కోసం మాత్రమే మీ యాప్ అనుమతులను మార్చవచ్చు లేదా అనుమతి రకాన్ని బట్టి మార్చవచ్చు.
- మీ ఫోన్, ఉపయోగించని యాప్‌ల కోసం అనుమతులను ఆటోమేటిక్‌గా తీసివేయడం చేయనివ్వండి.
- భవిష్యత్తులో డేటా సేకరణను నిలిపివేయడానికి, మీరు యాప్‌లను తొలగించవచ్చు.
చిట్కా: యాప్‌లో నుండి మీ డేటాను తొలగించమని మీరు రిక్వెస్ట్ చేయలేకపోతే, యాప్ ద్వారా సేకరించబడిన ఏదైనా డేటాను తొలగించడానికి మీరు డెవలపర్‌ను సంప్రదించవచ్చు. Android యాప్ డెవలపర్‌ను ఎలా సంప్రదించాలో తెలుసుకోండి.