1590
Appearance
1590 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1587 1588 1589 - 1590 - 1591 1592 1593 |
దశాబ్దాలు: | 1570లు 1580లు - 1590లు - 1600లు 1610లు |
శతాబ్దాలు: | 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 27 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మే – ఆగస్టు: ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ IV పారిస్‌ను ముట్టడించడంలో విఫలమయ్యాడు. అలెగ్జాండర్ ఫర్నేస్, డ్యూక్ ఆఫ్ పర్మా తన స్పానిష్ సైన్యంతో రక్షణగా రావడంతో హెన్రీ ముట్టడిని ఎత్తెయ్యాల్సి వచ్చింది.
- మే 17: ఎడిన్‌బర్గ్‌లోని హోలీరూడ్ అబ్బే వద్ద డెన్మార్క్‌కు చెందిన అన్నేకు స్కాట్లాండ్ పట్టపు రాణిగా పట్టాభిషేకం చేశారు. [1]
- మే 21: కాన్స్టాంటినోపుల్ ఒప్పందం కుదిరింది.
- ఆగష్టు 18: రోనోకే వలస స్థావరం గవర్నరైన జాన్ వైట్, ఇంగ్లాండ్కు సరఫరాల కోసం ఇంగ్లాండు వెళ్ళి తిరిగి వచ్చేసరికి అతడి స్థావరం నిర్జనమైందని కనుగొన్నాడు. అన్వేషణ విఫలమవడంతో, అతడు అక్టోబర్ 24 న ఇంగ్లాండ్కు తిరిగి వస్తాడు.
- సెప్టెంబర్ 5: అలెగ్జాండర్ ఫర్నేస్ సైన్యం బలంగా ఎదుర్కోవడంతో ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ IV పారిస్ ముట్టడిని ఎత్తివేసాడు.
- సెప్టెంబర్ 15: సిక్స్టస్ V తరువాత అర్బన్ VII 228 వ పోప్ అయ్యాడు. అతను పన్నెండు రోజుల తరువాత మలేరియాతో మరణించాడు.
- సెప్టెంబర్ 15: దిగువ ఆస్ట్రియా, వియన్నాలో న్యూలెంగ్‌బాచ్ భూకంపం గణనీయమైన నష్టాన్ని, కొంత ప్రాణనష్టాన్నీ కలిగించింది. బోహేమియా, సిలేసియా వరకు ఈ భూకంప ప్రభావం కనిపించింది.
- డిసెంబర్ 5: అర్బన్ VII తరువాత గ్రెగొరీ XIV 229 వ పోప్ అయ్యాడు.
- టయోటోమి హిడెయోషి జపాన్‌ను సమైక్య పరచాడు
- డచ్చి దళాలు స్పానిష్ వారిని దక్షిణ గెల్డర్‌ల్యాండ్ నుండి బయటకు నెట్టివేస్తాయి.
- హైదరాబాదు నగరాన్ని స్థాపించారు.
- ఓట్టోమన్ సుల్తాను పర్షియాతో చేస్తున్న యుద్ధంలో అవసరమైన ఇనుము, స్టీల్, ఇత్తడి, టిన్ లను సరఫరా చేసే ఒప్పందంపై .కొందరు ఆంగ్ల వ్యాపారులకు తన సామ్రాజ్యంలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతించాడు.
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Anne of Denmark: Biography". Retrieved 7 May 2019.