1822
స్వరూపం
1822 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1819 1820 1821 - 1822 - 1823 1824 1825 |
దశాబ్దాలు: | 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 7: అమెరికాలో స్వేచ్ఛ పొందిన బానిసల మొదటి సమూహం ఆఫ్రికా పశ్చిమ తీరానికి చేరుకుంది. వారే మోన్రోవియా నగరాన్ని స్థాపించారు.
- ఫిబ్రవరి 24: అహ్మదాబాదు లోని కాలూపూర్ స్వామినారాయణ దేవాలయం ప్రారంభమైంది. ఇదే తొట్టతొలి స్వామినారాయణ ఆలయం.
- ఏప్రిల్ 25: అమెరికాలో స్వేచ్ఛ పొందిన బానిసలు ఆఫ్రికా పశ్చిమ తీరానికి చేరుకుని లైబీరియా రాజధాని క్రిస్టోపోలిస్ అనే స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. దానికే 1824 లో మోన్రోవియాగా పేరు మార్చారు. అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మంరో పేరిట దీనికి ఆ పేరు పెట్టారు. [1]
- మే 16: సవర్ణ కుల నాయర్లు, సండార్ స్త్రీలు తమ వక్ష స్థలాన్ని కప్పుకున్నందుకు వారిపై దాడి చేసారు.
- జూలై 3: చార్లెస్ బాబేజ్. కంప్యూటరుకు ఆదిమ రూపమైన డిఫరెన్స్ ఇంజన్ ప్రతిపాదనను ప్రచురించాడు.
- జూలై 31: బ్రిటనులో చిట్టచివరి బహిరంగ కొరడా దెబ్బల శిక్షను ఎడింబరోలో అమలు చేసారు.
- సెప్టెంబరు 7: బ్రెజిల్, పోర్చుగల్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- తేదీ తెలియదు: రామమోహన్ రాయ్ ఆంగ్లో హిందూ పాఠశాలను స్థాపించాడు
- తేదీ తెలియదు: స్వీడన్లో కాఫీపై నిషేధాన్ని ఎత్తివేసారు
జననాలు
[మార్చు]- మే 22: పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1900)
- జూలై 22: గ్రెగర్ మెండల్, జన్యుశాస్త్రంలో జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త. (మ.1884)
- డిసెంబర్ 27: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (మ.1895)
- తేదీ తెలియదు: పండిత్ తారా సింగ్, సిక్ నిర్మలా శాఖకు చెందిన ప్రముఖ్ పంజాబీ పండితుడు, కవి.[2]
- తేదీ తెలియదు: రామనారాయణ్ తర్కరత్న, ప్రముఖ బెంగాలీ నాటకకర్త, రచయిత. (మ. 1886)
మరణాలు
[మార్చు]- జూలై 8: పెర్సీ షెల్లీ, ఇంగ్లీషు కవి (జ. 1792)
- ఆగష్టు 25: విలియం హెర్షెల్, వరుణ (యురేనస్) గ్రహాన్ని కనుగొన్న ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త. (జ.1738)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "The Republic of Liberia, Its Products and Resources", by Gerald Ralston, in The Nautical Magazine and Naval Chronicle (October 1862) p520
- ↑ Singh, Trilochan (2011). The Turban and the Sword of the Sikhs: Essence of Sikhism : History and Exposition of Sikh Baptism, Sikh Symbols, and Moral Code of the Sikhs, Rehitnāmās. B. Chattar Singh Jiwan Singh. p. 14. ISBN 9788176014915.